II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

Rate this post

Adavi Chetla Naduma – అడవి చెట్ల నడుమ ఒక జల్దరు

అడవి చెట్ల నడుమ
ఒక జల్దరు వృక్షం వలె
పరిశుద్ధుల సమాజములో
యేసు ప్రజ్వలించుచున్నాడు (2)
కీర్తింతున్ నా ప్రభుని
జీవ కాలమెల్ల ప్రభు యేసుని
కృతజ్ఞతతో స్తుతించెదను (2)

షారోను రోజా ఆయనే
లోయ పద్మమును ఆయనే
అతిపరిశుద్ధుడు ఆయనే
పదివేలలో అతిశ్రేష్టుడు (2)

పరిమళ తైలం నీ నామం
దాని వాసన వ్యాపించెగా
నింద శ్రమ సంకటంలో
నను సుగంధముగా చేయున్ (2)

మనోవేదన సహించలేక
సిలువ వైపు నే చూడగా
లేవనెత్తి నన్నెత్తుకొని
భయపడకుమని అంటివి (2)

నా త్రోవకు దీపం నీవే
నా బ్రతుకుకు జీవం నీవే
నా సేవకు బలము నీవే
నా ఆత్మకాదరణ నీవే (2)

ఘనమైన నా ప్రభువా
నీ రక్త ప్రభావమున
నా హృదయము కడిగితివి
నీకే నా స్తుతి ఘనత (2)

నీవు నా దాసుడవనియు
ఏర్పరచుకొంటినని
నేనే నీ దేవుడనని
భయపడకు-మని అంటివి (2)

Full Website- https://www.jesuslife.in/

Jesus Song- Jesus Hindi Song

English Song Jesus English Song

Bible Vachan बाइबिल सन्देश

विचार अनमोल विचार

Telugu Songs Lyrics Telugu Christian Songs


II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!