II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

Rate this post

Andhaala Tara Arudenche ll అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో

అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో

అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్

ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో

ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార||

  1. విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను

వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున

విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో

విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార||

  1. యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు

ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి

యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో

ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు||అందాల తార||

  1. ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే

బాలునిజూడ జీవితమెంత పావనమాయెను

ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము

Full Website- https://www.jesuslife.in/

Jesus Song- Jesus Hindi Song

English Song Jesus English Song

Bible Vachan बाइबिल सन्देश

विचार अनमोल विचार

Telugu Songs Lyrics Telugu Christian Songs


II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!